పాకిస్తాన్ లోని ముఖ్యపట్టణం కరాచీలో ఉన్న పంచముఖి హనుమాన్ ఆలయం అత్యంత పురాతన దేవాలయం

ఇక్కడ దాదాపు 17 లక్షల సంవత్సరాలుగా పంచముఖి హనుమంతుడిగా పూజలను అందుకుంటుందని భక్తుల విశ్వాసం

పాకిస్తాన్ లోని ఇస్లాంకోట్ లో రాముడి ప్రసిద్ధ దేవాలయం ఉంది

త్రేతాయుగంలో శ్రీరాముడి సైన్యంలో ఉన్న జాంబవంతుడి.. కుమార్తె జాంబవతిని ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు వివాహం చేసుకున్నాడు

జాంబవతి కృష్ణ దంపతులకు పుట్టిన కుమారుడు సాంబుడు. తండ్రి ఇచ్చిన శాపం నుంచి విముక్తి కోసం సాంబ ముల్తానాలో సూర్యదేవాలయం నిర్మించాడు

ఈ ఆలయం ముస్లింపాలనలో ధ్వంసమై.. ఇప్పుడు శిధిలాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి

సతి పార్వతి 51 శక్తిపీఠాల్లో ఒకటి హింగ్లాజ్ ఆలయం. ఈ ఆలయం పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌కు 120 కి.మీ దూరంలో హింగోల్ నది ఒడ్డున ఉంది

సతి భాగాలు ఎక్కడ పడితే అక్కడ శక్తిపీఠంగా ఏర్పడిందని పురాణాల కథనం. ఈ క్షేత్రంలో సతిదేవి తలపడిందని చెబుతారు

కరాచీ నగరంలోనే బందర్ రోడ్డులో ఉన్న స్వామినారాయణ దేవాలయం సుమారు 160 సంవత్సరాల నాటిది

ఇక్కడ హిందూ, ముస్లిం లు కూడా పూజలను నిర్వహిస్తారు. అంతేకాదు భారతదేశం-పాకిస్తాన్ విభజన సమయంలో.. ఈ దేవాలయాన్ని శరణార్థి శిబిరంగా ఉపయోగించారని చెబుతారు