మీరు ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు దాని ధర ఆ వస్తువుపై ఉంటుంది

దానినే MRP (maximum retail price) అంటారు

తెలుగులో గరిష్ట చిల్లర ధర. దుకాణ దారుడు ఏ వస్తువునైనా సరే MRP ధరకు మించి విక్రయించకూడదు

చాలా మందికి MRP గురించి తెలుసు

కానీ FRP గురించి ఎవ్వరికి తెలియదు. దీని గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

FRP అంటే (fair remunerative price) అంటారు. తెలుగులో సరసమైన ధర అని అర్థం

ఇది రైతుల పంట లేదా ఉత్పత్తికి సంబంధించినది. FRP అనేది వ్యవసాయ ఉత్పత్తుల సరసమైన ధర

FRP నియమాన్ని కేంద్ర ప్రభుత్వం విధించింది. దీనివల్ల రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది

దీనివల్ల చిన్న, సన్నకారు రైతులకు సరైన న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వాళ్ళు పండించినవి అమ్ముకోవచ్చు