సాధారణంగా ఇది నేలపైనే ఉంటుంది. కానీ, ఒక్కసారి వరద నీరు చుట్టూ చేరితే క్రమంగా ఆ ఇళ్లు పైకి తేలుతుంది

వరద నీరు తగ్గితే మళ్లీ దిగొస్తుంది

జపాన్‌కు చెందిన ఇచిజో కొముటెన్ అనే కంపెనీ ఈ ఇంటితో చేసిన కొత్త ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది

ఈ ప్రత్యేకమైన ఇంటిలో ఇతర ఇళ్లలో సాధారణంగా లభించే అన్ని లగ్జరీ సౌకర్యాలను కూడా పొందుతారు

ఇందులో వరద ముంపు ప్రాంతాల్లో కూడా ప్రజలు హాయిగా జీవించవచ్చు

ఎంతటి భారీ వరదలు వచ్చినా ఈ ఇంటిలోని వారికి ఏమీ కాదు. ఎందుకంటే ఇది వరద నీటిపై తేలి ఉంటుంది

వరద బాధిత ప్రాంతాలకు ఈ ఇల్లు అనుకూలమని సదరు జపాన్‌ కంపెనీ ప్రకటించింది

ఈ ఇంటి నిర్మాణం వినూత్నంగా, వాటర్ ప్రూఫ్ తో ఉంటుంది

ఎంతటి వరదలు సంభవించినా ఇల్లు మునిగిపోయే ప్రమాదం లేదని స్పష్టం చేశారు