తేనె తియ్యగా ఉంటుందనే విషయం అందరికీ తెలుసు
అయితే తేనె చేదుగా కూడా ఉంటుందంటే నమ్ముతారా? నమ్మకలం కలగకున్నా.. నమ్మి తీరాల్సిందే
ఎందుకంటే కర్నాటకలోని చామరాజనగర్ జిల్లా లో చేదు తేనె కూడూ దొరుకుతోంది
బిలిగిరిరంగన కొండల్లో తీపి తేనెతో పాటు చేదు తేనెనూ సేకరిస్తుంటారు అక్కడి స్థానికులు
వైలెట్ ఫ్లవర్, స్టార్ ఫ్లవర్, బీట్ ఫ్లవర్ మకరందాన్ని పీల్చే తేనెటీగలు ఆ సీజన్ లో ఉత్పత్తి చేసే తేనె చేదుగా ఉంటుంది
ఈ సీజన్ లో గ్రామస్థులు.. నేరుగా అడవులకు వెళ్లి చేదు తేనెను సేకరిస్తుంటారు
చేదు తేనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అక్కడి గిరిజనులు చెబుతున్నారు
షుగర్ బాధితులకు తీపి తేనె కంటే చేదు తేనె చాలా ప్రయోజనాలు కలిగిస్తుందంటున్నారు