ఆస్కార్ అవార్డును 1929లో డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీలు అకాడమీ అవార్డ్స్ పేరుతో ప్రారంభించారు.
ఆస్కార్ అవార్డు చూడడానికి గోల్డ్ కలర్ లో ఉంటుంది. కానీ పూర్తిగా అది బంగారం కాదు. కాపర్ తో తయారు చేసి.. పైన గోల్డ్ పూత పూస్తారు.
ఈ అవార్డు 13.5 ఇంచుల హైట్, 4 కేజీల వెయిట్ ఉంటుంది. ఈ ఆస్కార్ అవార్డు తయారు చేసేందుకు 400 డాలర్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది.
ఆశ్చర్యం ఏమిటంటే ఈ అవార్డు అమ్మితే కేవలం ఒక్క డాలర్ మాత్రమే వస్తుంది.
ఈ ఆస్కార్ అవార్డు విలువ ఒక్క డాలర్ ఉండడానికి ప్రధాన కారణం 1950లో అకాడమీ ప్రవేశపెట్టిన నిబంధననే.
గతంలో అమెరికన్ డైరెక్టర్ ఆర్సన్ వెల్స్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ దక్కించుకున్నారు.
అయితే గెలుచుకున్న అవార్డుని ఆర్థిక ఇబ్బందుల కారణంగా వేలం వేసి ఏకంగా రూ. 6.5 కోట్లకు అమ్ముకున్నారు.
దాంతో ఆగ్రహించిన అకాడమీ.. ఇంకెవరు ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డును అమ్మకుండా 1950లో ఒక రూల్ తీసుకువచ్చింది
ఆస్కార్ గెలుచుకున్న విన్నర్ తన అవార్డు ఇతరులకు అమ్మడానికి వెళ్లేదని, తిరిగి అకాడమీ సభ్యులకు ఇచ్చేస్తే ఒక డాలర్ ఇస్తామని నిబంధన తెచ్చారు. అంటే 82 రూపాయలు అన్నమాట.