ప్రస్తుత పరిస్థితుల్లో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండటం ముఖ్యం..
శరీరంలో గుండె చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఇది శరీరానికి రక్తాన్ని ఆపకుండా నిరంతరం సరఫరా చేస్తుంది.
గుండె కండరాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కావున కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
ధూమపానం మీ గుండెకు చాలా హానికరం. గుండె కండరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ధూమపానానికి దూరంగా ఉండండి.
గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ పరిమాణాన్ని నియంత్రించాలి.
గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
ఆల్కహాల్ గుండె కండరాలను బలహీనపరుస్తుంది. కావున మద్యానికి దూరంగా ఉండండి.
గుండె కండరాలను రక్షించడానికి రక్తపోటును నియంత్రించడం చాలా ముఖ్యం