ఈ మధ్యకాలంలో అందరూ ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తున్నారు

అసలే సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి

మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు సేఫ్‌గా ఉంచాలంటే పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి

లేదంటే మోసాలు బారిన పడటం ఖాయం

మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ ఈజీగా ఉంటే, సైబర్ కేటుగాళ్లు మీ ఖాతాను సులభంగా యాక్సెస్ చేయవచ్చు

మీ వ్యక్తిగత వివరాలు, ఐడీ లాంటివి తెలియని వ్యక్తులతో పంచుకున్నా.. మీ బ్యాంక్ ఖాతా ప్రమాదంలో పడే అవకాశం ఉంది

అన్ని బ్యాంకులు ఈ-మెయిల్, సోషల్ మీడియా ద్వారా భద్రతా సలహాలను కస్టమర్లకు అందిస్తుంటాయి

వాటి ద్వారా ఖాతాదారులు మోసాల బారిన పడకుండా తమ నగదును కాపాడుకోవచ్చు

మీ బ్యాంక్ ఖాతాపై నిఘా ఉంచితే ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే, వాటిని వెంటనే తెలుసుకోవచ్చు