ఉదయం నిద్రలేవగానే పని హడావిడి, ఆఫీసు హడావిడిలో ఇంట్లో అందరికీ సరిపడా వంట చేయడానికి తగిన సమయంలో ఉండదు
టైం పొదుపు చేయడానికి చాలా మంది ముందు రోజు రాత్రి కూరగాయలు కట్ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టి, ఉదయం వాటితో వంట చేస్తారు
ఐతే కట్ చేసిన కూరగాయలను ఫ్రిజ్‌లో సరిగ్గా ఉంచకపోతే, అవి నల్లగా మారే అవకాశం ఉంటుంది
ఇలా చేశారంటే కూరగాయ ముక్కలు ఫ్రెష్‌గా ఉంటాయి
గుమ్మడికాయ విత్తనాలను తీసివేసి చిన్న ముక్కలుగా కట్ తర్వాత గాలి చొరబడని డబ్బాలో ఉంచితే ఫ్రెష్‌గా ఉంటాయి
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ వంటి వాటిని కట్ చేసి లైట్ గా ఫ్రై చేసి, టిష్యూ పేపర్‌లో చుట్టి, ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి
ఆకుకూరలను ముందుగా కాడల నుంచి ఆకులను తొలగించి భద్రపరిస్తే తాజాగా ఉంటాయి
ఉల్లిపాయలు, వెల్లుల్లిని కూడా తొక్కతీసి గాలి చొరబడని డబ్బాలో ఉంచి, ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఐతే ఉల్లిపాయలను 1 రోజు కంటే ఎక్కువ ఫ్రిజ్‌లో ఉంచకూడదు