పొడవుగా, ఆరోగ్యంగా ఉండే కురుల కోసం మగువలు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు

ఎందుకు రాలుతుందో కారణం తెలియకుండానే ఒక్కోసారి విపరీతంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది

సంప్రదాయ మూలికలతో తయారు చేసే ఈ హెయిర్‌ మాస్క్‌ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది

మెంతి ఆకు, ఉసిరి, గులాబీ రేకలు, మందార, వేప, కరివేపాకు, శీకాకాయ వీటన్నింటినీ ఎండబెట్టి పొడి చేసుకోవాలి

రెండు స్పూన్ల చొప్పున ఒక్కోదాన్నీ గిన్నెలోకి తీసుకొని తగినన్ని గోరు వెచ్చని నీటిని కలపాలి

దాన్ని రాత్రంతా నానబెట్టి నూనె రాసిన తలకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చెయ్యాలి

ఇలా వారాని కోసారి చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుముఖం పడుతుంది