రాముడి పేరుతో మీరు హనుమంతుడికి ఏదైనా సమర్పిస్తే.. ఆంజనేయుడు ఖచ్చితంగా ప్రసన్నం అవుతాడు. మీ సమస్యలను తీరుస్తాడు
మీరు మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతుడి దేవాలయానికి వెళ్తే రాముడి పేరును జపించండి మీకు రాబోయే కష్టాలన్నీ తొలగిస్తాడు
మంగళవారం, శనివారాల్లో ఉపవాసం ఉండి పేదలకు భోజనం పెట్టడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో డబ్బుకు, ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదు
మంగళవారం, శనివారాల్లో హనుమంతునికి శెనగలను నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల ఆంజనేయుడు అనుగ్రహం మీపై ఉంటుంది
మంగళవారం, శనివారాల్లో సుందరకాండ పారాయణం పఠించండి. ఇలా చేయడం వల్ల ఆంజనేయుడు అనుగ్రహం మీపై ఉంటుంది
మంగళవారం, శనివారాల్లో రామరక్షా స్తోత్రాన్ని పఠించండి. అలాగే హనుమంతుడికి బెల్లం సమర్పించండి. ఇలా చేయడం వల్ల జీవితంలోని సమస్యలన్నీ తీరుతాయి
శనివారం నాడు హనుమంతునికి లవంగాలు, యాలకులు, తమలపాకు నైవేద్యంగా పెడితే శని బాధలు తొలగిపోతాయి
ఆవనూనెలో లవంగాలు వేసి హనుమంతుని పూజించడం వల్ల బాధల నుంచి విముక్తి పొందొచ్చు