అందరికీ అన్ని రంగాలలో జనరల్ డ్యూటీలు ఉండే ఉద్యోగాలు రావడం చాలా కష్టం. చాలా సంస్థల్లో నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి
ఈ రాత్రి షిఫ్టులలో పని చేసే వారికి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి
అలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
రాత్రి షిఫ్టులో పనిచేసే వారు ముందుగా నిద్ర సమయాన్ని ఫిక్స్ చేసి, రోజులో ఒకే సమయంలో నిద్రపోయి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు
రాత్రి నిద్ర పట్టకూడదనే ఉద్దేశంతో టీ, కాఫీ, ఇతర కూల్ డ్రింక్స్ తాగితే హెల్త్ ఎఫ్టెక్ట్ అవుతుంది
ఖాళీ సమయంలో మీ కుటుంబంతో సమయం గడపండి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది
మీ ఆరోగ్య రక్షణకు యోగా, ధ్యానం వంటివి చేస్తే ఫలితం ఉంటుంది. మంచి ఆహారం, మంచి జీవన శైలిని అలవరుచుకోవాలి
రాత్రిపూట పని చేసే వారు ఎక్కువగా తింటారని అనేక పరిశోధనల్లో తేలింది. అయితే, అతిగా అస్సలు తినొద్దు