అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది

ఇలా ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి ఔషధంలా పని చేసే పెరుగుని మనం ఎక్కవగా ఇతర ఆహారంతో కలిపే తీసుకుంటుంటాం

పెరుగు కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు

పెరుగును మామిడి పండుతో కలిపి తినడం వల్ల శరీరంలో అలర్జీ, చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి

ఉల్లిపాయలతో కలిపి పెరుగు తినడం వల్ల సోరియాసిస్‌, దద్దుర్ల వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది

పెరుగును పాలతో కలిపి తినడం వల్ల డయేరియాతో పాటు ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు

పెరుగు, చేపలు కలిపి తినడం వల్ల కడుపులో గ్యాస్‌, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు

నెయ్యి, నూనెతో వేచించిన పదార్థాలతో పెరుగు కలుపుకొని తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. నిరసంగా అనిపిస్తుంది