పెరుగుతున్న కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల వల్ల కూడా జట్టు ఊడడం ఎక్కువైపోయింది. అయితే వెంట్రుకలు రాలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
జట్టుకు గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తేనే కాంతివంతంగా తేమతో ఉంటుంది. మరీ వేడి నీరు వాడితే బాగా పొడిబారిపోయి చిట్లిపోతుంది.
అలాగే జట్టును బాగా రుద్ది రుద్ది కడుగుతుంటారు కొందరు. సున్నితంగా రుద్దుతూ వాష్ చేసుకోవాలి. లేదంటే జట్టులో సహజంగా ఉండే కాంతిని కోల్పోతుంది.
జట్టును గోరువెచ్చని నీటితో తడిపిన తర్వాతే షాంపూ అప్లై చేసుకోవాలి. షాంపూ, కండిషనర్ పూర్తిగా పోయేలా నీళ్లతో చక్కగా కడగాలి. లేదంటే జట్టు ఊడుతుంది.
తగిన మోతాదులో షాంపూని కొన్ని నీళ్లలో కలిపి డైల్యూట్ చేసి జట్టుకు అప్లై చేసుకోవడం మంచిది. నేరుగా జుట్టుపై షాంపూ వేయకూడదు.
తడి జట్టును దువ్వకూడదు. తలస్నానం అయిపోయాక చక్కగా సహజంగా ఆరనివ్వాలి. తర్వాత దువ్వుకోవాలి.
జుట్టుకు వారానికి రెండుసార్లైనా నూనెతో మంచిగా మర్దన చేసుకోవాలి. రక్తప్రసరణ పెరిగి వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.