కొంత మంది దశాబ్దాలు గడుస్తోన్న ప్రేక్షకుల గుండెల్లో మాత్రం ఇప్పటికీ అలానే కొలువై ఉంటారు. అలాంటి అరుదైన నటీమణుల్లో దివ్య భారతి ఒకరు.

చిన్న వయసులోనే ఊహించని స్టార్ డమ్., అగ్రహీరోలతో నటించిన అగ్ర స్థానానికి చేరింది.

అలాంటి భామ ఆకస్మాత్తుగా కన్నుమూయడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.ఈమె బొబ్బిలి రాజాతో పరిచయం అయ్యారు.

దివ్యభారతి సాజిద్ నడియాడ్‌వాలాను పెళ్లి చేసుకుంది. ఇక ఓ సంవత్సరం తర్వాత ఏప్రిల్ 5, 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద స్థితిలో మరణించింది.

అయితే ఇప్పటికీ ఆమె మృతికి గల సరైన కారణాలు లేవని.. ఆమె మృతి పట్లు చాలా అనుమానాలు ఉన్నాయని అంటుంటారు ఆమె అభిమానులు.

ఈమె టాలీవుడ్‌లో చివరి చిత్రం ‘తొలి ముద్దు’. ఈమె చనిపోయిన తర్వాత విడుదలైంది. అందులో చివరి సన్నివేశాలను రంభతో షూట్స్ చేశారు.