‘ప్రాజెక్ట్-కె’ ఆ పాత్ర ఫస్ట్‌లుక్‌ విడుదల.. సినీప్రేమికులు ఎప్పుడు ఎప్పుడా అని చూస్తున్న చిత్రాల్లో ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్-కె’ ఒకటి.

ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినిదత్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడిగా దీపికా పదుకొణె నటిస్తుంది.

అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా దిశాపటాని పుట్టినరోజు పురస్కరించుకొని ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

తాజాగా దిశాపటాని పుట్టినరోజు పురస్కరించుకొని ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో దిశాపటానీ ఒక ప్రత్యేకమైన సాంగ్ చేయనుందని తెలిపారు మేకర్స్.

అంతే కాకుండా ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలలో కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుందని తెలిపాయి చిత్రవర్గాలు.

కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా రానుంది.

ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.