మీరు టీ ప్రియులు అయితే ఖాలీ కడుపుతో టీ తాగడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవడం ఉత్తమం.

ఉదయం నిద్ర లేవగానే ఏమి తీసుకోకుండా కేవలం టీ తాగడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

నోటిలోని బ్యాక్టీరియా షుగర్ లెవల్స్ ని పెంచుతుంది.

ఖాళీ కడుపుతో టీ తాగితే డీ హైడ్రేషన్ కి కూడా గురయ్యే అవకాశముంది అని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

టీలో ఉండే పదార్థాలు శరీరంలో మూత్రస్థాయిని కూడా పెంచుతాయి. దీనివల్ల శరీరంలోని నీరు అంతా బయటికీ పోతుంది.

పరిగడుపున టీ తాగితే జీర్ణక్రియ క్షీణిస్తుంది. జీర్ణవ్యవస్థ దెబ్బతినడం వల్ల శరీరంలో శక్తి నశించిపోతుంది. దీంతో ఎల్లప్పుడూ అలిసిపోయినట్టు కనిపిస్తారు.

టీ ఎక్కువగా తాగడం వల్ల మలబద్ధకం లాంటి సమస్య కూడా ఏర్పడుతుంది.

 అంతేకాదు.. నిద్రలేమి సమస్య బరువు పెరగడం, ఆకలి మందగించడం, రక్తపోటు సమస్యలు వస్తాయి.