ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించే సినీ సెలబ్రెటీల్లో దర్శకుడు సుకుమార్ ఒకరు. సినిమాల విషయంలో ఎంత బిజీగా ఉన్నా సుకుమార్ కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంటారు.
ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కుటుంబంతో గడిపే సుకుమార్ ఈరోజు తన పెళ్లి రోజు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.
మన లెక్కల మాస్టర్ భార్య తబిత కు వెడ్డింగ్ విషెస్ చెప్తూనే ఫొటోస్ రిలీజ్ చేసారు.
సుక్కు ఫామిలీ ఫొటోస్ సోషల్ మీడియాలో చాల తక్కువగా కనిపిస్తూ ఉంటాయి..
తాజాగా సుకుమార్ భార్య తబిత కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. భార్యతో పాటు సుకుమార్ దిగిన ఫొటోలు చూసిన ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక తబిత విషయానికొస్తే ఆమె.. లాండ్రీ కార్డ్ పేరుతో ఆన్‌లైన్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పటికే 'లాండ్రీ కార్డ్' పేరుతో మూడు బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా సుకుమార్ రైటింగ్స్ బాధ్యతల్ని కూడా ఆమె చూస్తున్నారు.