స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌కు కూడా అలాంటి టెన్షనే పట్టుకుంది. ఈయనకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు.

అందులో పెద్ద కూతురు అదితికి సినిమా హీరోయిన్‌ కావాలని కోరిక.

ఇది శంకర్‌కు ఏమాత్రం ఇష్టం లేదు.

ఈ విషయాన్ని అదితి శంకర్‌నే విరుమాన్‌ చిత్ర ఆడియో విడుదల వేదికపై స్వయంగా పేర్కొన్నారు.

అయితే హీరోయిన్‌గా సక్సెస్‌ కాకపోతే మళ్లీ వైద్య వృత్తిని చేపడతానని తండ్రికి నచ్చజెప్పి, ఒప్పించి నటిగా విరుమాన్‌ చిత్రం ద్వారా రంగప్రవేశం చేశారు అదితి.

అయితే శంకర్‌ తన కుమార్తె నటిగా మారడానికి ఒప్పుకోవడం వెనుక ఓ కారణం ఉంది.

విరుమాన్‌ చిత్రానికి ముత్తయ్య దర్శకుడు, హీరో కార్తీ కావడంతో అదితి అందులో నటించడానికి శంకర్‌ అంగీకరించారట.