భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ పేజీని లిఖించుకున్న హీరో రజనీకాంత్. 50 ఏళ్ల క్రితం వెండి తెరపై అడుగు పెట్టిన రజనీకాంత్ కెరీర్ మొదట్లో వెండి తెరపై చిన్న చిన్న పాత్రలను వేస్తూ.. హీరోగా .. సూపర్ స్టార్ గా ఖ్యాతిగాంచారు.
కెరీర్ లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ చివరి సినిమా అంటూ గత 20 ఏళ్లుగా వినిపిస్తోన్న మాట..రజని కాంత్ హీరోగా 20 ఏళ్లు క్రితం నటించిన బాబా సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజై.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
దీంతో అప్పట్లో రజని కాంత్ తాను ఇక సినిమాల్లో నటించను అని ప్రకటించి సంచలనం సృష్టించాడు. తర్వాత మనసు మార్చుకుని మళ్ళీ వరస సినిమాల్లో నటిస్తూ.. రోబో వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం రజనీకాంత్ తన 170 వ సినిమా జైలర్ షూటింగ్ తో బిజీబిజీగా ఉన్నారు. అనంతరం రజనీ, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో నటించనున్నారు.
అయితే ఈ సినిమానే తలైవా రజని కెరీర్ లో చివరి సినిమా అనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అంతేకాదు రజని చివరి సినిమా అంటూ తమిళ డైరెక్టర్ మిస్కిన్ చెప్పడంతో ప్రస్తుతం ఈ మాట సర్వాత్రా చక్కర్లు కొడుతోంది.
డైరెక్టర్ మిస్కిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తలైవా రజనీకాంత్ లాస్ట్ మూవీపై స్పందించాడు. రజని కెరీర్ లో 171వ సినిమా..
50 దశాబ్దాల రజనీ కెరీర్ తన 171 సినిమాతో గుడ్ బై చెబుతారని తాను భావిస్తున్నట్లు మిస్కిన్ చెప్పడం విశేషం..అంతేకాదు..
లోకేష్ తో సినిమా చేయడం కోసం రజనీయే ఆసక్తి చూపాడని.. అంతేకాదు తానే స్వయంగా సినిమా చేద్దామని అడిగినట్లు మిస్కిన్ తెలిపారు.