ఎఫ్ 3 సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణతో యాక్షన్ చిత్రం చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటివరకు డైరెక్టర్‏గా హిట్ చిత్రాలను తెరకెక్కించిన అనిల్ రావిపూడి.. ఎఫ్ 3 మూవీలో బుట్టబొమ్మతో కలిసి స్పెషల్‏ సాంగ్ లో స్టెప్పులేసి అదుర్స్ అనిపించుకున్నారు.

 తాజాగా తాను యాక్టింగ్ కూడా చేస్తానంటూ మనసులోని మాటలను బయటపెట్టాడు..