Dimple Hayathi (1)

సినీ తారలకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Dimple Hayathi (2)

వాళ్ల కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతుంటారు కొందరు ఫ్యాన్స్‌. 

Dimple Hayathi (3)

మరి కొందరేమో ఏకంగా గుడి కట్టేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. 

Dimple Hayathi (4)

తాజాగా మరో అభిమాని హీరోయిన్‌ డింపుల్‌ హయాతికి గుడి కట్టాలనుకున్నాడు.

మ్యాచో హీరో గోపీచంద్‌తో డింపుల్‌ కలిసి నటించిన సినిమా రామబాణం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌, మీమర్స్‌తో హీరోహీరోయిన్లు సరదాగా ముచ్చటించారు. 

ఈ సందర్భంగా ఓ అభిమాని.. 'మీకు గుడి కట్టాలనుకుంటున్నా. అది పాలరాయితో కట్టించాలా? లేక ఇటుకలతో కట్టించాలా' అని ప్రశ్నించాడు.

దీనికి డింపుల్‌ సమాధానిమిస్తూ.. 'నాకు బంగారంతో గుడి కట్టండి..చాలా బాగుంటుంది' అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.