శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు
మీ రోజువారీ జీవనశైలిలో యోగా, రన్నింగ్ లేదా జాగింగ్ తప్పనిసరిగా ఉండాలి
మధుమేహం ఉన్న వారు చురుకుగా ఉండాలని డాక్టర్లు ఎక్కువగా సలహా ఇస్తుంటారు
ఐతే చాలా మంది ఈ ముఖ్యమైన అలవాటును విస్మరిస్తుంటారు
షుగర్ వ్యాధిగ్రస్తులు తగినంత నిద్ర పోవాలి. లేదంటే తరచుగా అలసట ఇబ్బంది పెడుతుంది
తగినంత నీరు తాగకపోవడం వల్ల శరీరంలో శక్తి తగ్గిపోతుంది. ఇది అలసటకు దారితీస్తుంది
అందుకే ప్రతిరోజూ దాదాపు 3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తుంటారు
కొంతమందికి మధుమేహ వ్యాధి ఉన్నప్పటికీ.. స్వీట్స్ తినటాన్ని చాలా ఇష్టపడతారు
అవసరమైన దానికంటే ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యం మరింతగా క్షీణించడం ప్రారంభమౌతుంది.కాబట్టి ఈ అలవాటును మానుకోవాలి