ఆ కోరికలపై తీవ్ర ప్రభావం చూపే మధుమేహం.. మహిళల్లోనే ఎక్కువంట..
ప్రస్తుతం మధుమేహం కామన్‌గా మారిపోయింది. జీవనశైలిలో మార్పులే కారణమంటున్నారు.
మగవారితో పాటు ఆడవారికి మధుమేహం వల్ల ఎక్కువ సమస్యలు కనిపిస్తుంటాయి.
ఆడవారిలో మధుమేహం వల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు, శృంగార కోరికలు తగ్గిపోవడం, సంతానలేమి వంటి అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి.
అందుకే మధుమేహం రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహ సమస్య రాకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు అదుపులో ఉంచుకోవడంతోపాటు వ్యాయామాలు చేయాలి.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి.
విటమిన్లు, ఖనిజాల వంటి పోషకాలు ఆహారం తీసుకోవాలి.
ఓకేసారి అధిక ఆహారం తీసుకోకుండా, తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినడం మంచిదని అంటున్నారు.
బ్రెడ్, బంగాళాదుంప, సెరల్స్ లాంటివి పక్కన పెట్టి ఓట్మీల్, తృణ ధాన్యాలు అధికంగా తీసుకోవాలి.
చక్కెరలు అధికంగా ఉండే కూల్ డ్రింక్స్ పక్కన పెట్టి, నీళ్లు ఎక్కువగా తాగాలి.
అవకాడో, స్ట్రాబెర్రీ, యాపిల్స్ లాంటి పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే మంచిది.