కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తమిళ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

తాజాగా సార్ సినిమా ద్వారా తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

తాజాగా కెప్టెన్ మిల్లర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న ధనుష్‌ రీసెంట్‌గా బ్రేక్ సెషన్‌లో అభిమానులతో ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులు మీ ఫేవరెట్ తెలుగు హీరో ఎవరు అని ప్రశ్నించగా

ఈయన ఏమాత్రం సంకోచం వ్యక్తం చేయకుండా తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అంటూ సమాధానం చెప్పారు.

ధనుష్ గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పడంతో అప్పటి ట్వీట్ ను కూడా అభిమానులు వైరల్ చేస్తున్నారు.