ధనుష్, సంయుక్త మేనన్ జంటగా రూపొందించిన ద్విభాషా చిత్రం 'సార్' ఆడియో విడుదల కార్యక్రమంలో ధనుష్ తన పాఠశాల రోజులను గుర్తుచేసుకున్నారు
టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మువీ ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది
కథను మించి అందులోని సందేశం నాకు బాగా నచ్చింది
మమ్మల్ని చదివించేందుకు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో.. నా పిల్లలను చదివిస్తుంటే అర్థమవుతోంది
చదువుకోవాల్సిన సమయంలో ఓ అమ్మాయి కోసం ట్యూషన్‌లో చేరాను. నేను వచ్చినట్టు ఆమెకు తెలియాలని బైక్‌తో సౌండ్ చేసేవాణ్ని
మీరంతా బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉంటారు. బయట సౌండ్ చేసేవాడు వీధుల్లో డ్యాన్స్ చేసుకోవాల్సిందేనని ఓ రోజు మా టీచర్ అన్నారట
టీచర్ చెప్పినట్టే జరిగింది. వెనక్కి తిరిగి చూస్తే.. అప్పుడు ఎందుకు చదువుకోలేదాని చింతిస్తున్నా. మీరు నాలాగా చేయకండి అంటూ ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు