సార్ సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు స్టార్ హీరో ధనుష్.
ఇకపోతే ధనుష్ కొత్తింటి కోసం కలలు కంటున్నట్లు గతేడాది వార్తలు వచ్చాయి.
చెన్నైలో ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మిస్తున్నాడని, ఇందుకోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడని ఊహాగానాలు వెలువడ్డాయి.
తాజాగా ఇదే నిజమైంది. చెన్నైలోని పోయిస్ గార్డెన్‌లో లగ్జరీ ఇంటిని నిర్మించాడు ధనుష్.
దీని విలువ దాదాపు రూ.150 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
ఇటీవలే ధనుష్ తన పేరెంట్స్‌తో కలిసి గృహప్రవేశం కూడా పూర్తి చేశాడు.
ఇక ఈ ఇంటిని తన తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం.