కోరింగ అభయారణ్యం మడ అడవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ నుండి 10 కి.మీ. దూరంలో ఉంది
అటవీశాఖ వారి లెక్కప్రకారం 235 చ. కి. మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మడ అడవులు దేశంలోనే రెండవ పెద్ద మడ అడవులు
చిత్తడినేలలో పెరిగే చెట్లయొక్క వేర్ల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది
భూమిలోనికి ఉండే వేర్లవల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్ తీసుకొనే అవకాశం తక్కువగా ఉంటుంది
ఎందుకంటే, ఇక్కడి నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి
వేర్ల ద్వారా గాలిపీల్చుకునే ఈ ' చిత్తడి అడవులు ' కేవలం నదీ సాగరసంగమ ప్రదేశంలో ఏర్పడ్డ చిత్తడి (బురద) నేలల్లోనే పెరుగుతాయి
అన్ని నదీ సాగర సంగమాలు చిత్తడి నేలలని ఏర్పరచవు
గంగాతీర ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని " సుందర వనాలు " మడ అడవుల తరువాతి స్థానం కోరింగ అభయారణ్యానిదే
అందంగా, గుబురుగా, దట్టంగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోతనుంచి భూమిని రక్షించే కోటలుగా ఉన్నాయి