అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె అమెరికాకు చెందిన ఓ డాక్టర్ ను వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు.
ఇలా 26వ సంవత్సరంలో వివాహం చేసుకొని అమెరికా వెళ్లినటువంటి లయ అక్కడ ఉద్యోగం చేస్తూ భారీగా డబ్బు సంపాదించే వారని తెలుస్తోంది.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె అమెరికాలో తను ఏం చేస్తుండేవారు తెలియజేశారు.
2011 నుంచి ఈమె ఐటీ సెక్టార్ ఉద్యోగం చేసే వారిని తెలియజేశారు. అయితే ఇండియాకు చెందిన కంపెనీకి తాను ఉద్యోగం చేసే దానిని వెల్లడించారు.
ఆ సమయంలో తనకు టాక్స్ లన్ని పోను నెలకు 12,000 డాలర్ల జీతం వచ్చేదని తెలిపారు.
ఇక ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈమె నెలకు ఏకంగా 9,60,000 జీతం అందుకునే వారని ఈ సందర్భంగా లయ తెలియజేశారు.
ఇక తాను 2017 లో ఈ జాబ్ వదిలేసానని అనంతరం డాన్స్ స్కూల్ ప్రారంభించామని తెలిపారు.
అయితే కోవిడ్ కారణంగా తన డాన్స్ స్కూల్ కూడా మూతపడిందని లయ తెలియజేశారు.