ప్రస్తుతం విదేశాలకు వెళ్లడం అందరికి సర్వసాధారణమైపోయింది. అందమైన ప్రదేశాలను చూసేందుకు పర్యాటకులు నిత్యం విదేశాలలో పర్యటిస్తారు

అక్కడికి వెళ్లిన తర్వాత మీరు ఇబ్బందులు ఎదుర్కోకూడదనుకుంటే అక్కడి నియమాలు, చట్టాలు, సంస్కృతి, భాష, ఆహారం, ప్రయాణం, వీసా మొదలైన వాటి గురించి తెలుసుకోవాలి

విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటులో ఉండాలి. దీంతోపాటు మీకు టూరిస్ట్ వీసా అవసరమా లేదా అని కూడా తెలుసుకోవడం మంచిది

ఏదైనా విదేశీ పర్యటనకు వెళ్లే ముందు మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని ఫుల్‌ బాడీ చెకప్‌ చేసుకోవడం మంచిది

మీరు శాఖాహారం లేదా భారతీయ ఆహారాన్ని తినాలనుకుంటే ఎక్కడ తినవచ్చో తెలుసుకుంటే మంచిది

విహారయాత్రకు వెళ్లే ముందు మీరు ఆ దేశంలో ఏ ప్రదేశాలను సందర్శించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. అక్కడికి ఎలా అయితే తొందరగా వెళ్లొచ్చో తెలుసుకోండి

వీసా లేకుండా కొన్ని దేశాలు సందర్శించవచ్చు. కానీ అక్కడ ఎంట్రీ లేదా ఎగ్జిట్ రుసుము చెల్లించాలి

మీరు అలాంటి దేశాన్ని ఎంచుకుంటే ఆ దేశంలో టూరిస్ట్ వీసా అవసరం ఉండదు. అయితే ఆ రుసుము ఎంతో తెలుసుకుంటే మంచిది