ఇప్పటివరకు పరిశ్రమలో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటీమణులలో దీపికా కూడా.

కథానాయికగా వెండితెర అరంగేట్రం చేసి15 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ 15 ఏళ్ల ప్రయాణంలో దీపిక ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

ఇక ఇప్పటివరకు టాప్ హీరోయిన్ గా మెప్పించిన దీపికా.. ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెడుతుంది.

15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆనందంలో దీపికా పదుకొణె తన సొంత బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ఇది సెల్ఫ్ కేర్ బ్రాండ్.

దాని పేరు 82 ఈస్ట్. తన సెల్ఫ్ కేర్ బ్రాండ్ ను సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది దీపికా.

‘రెండేళ్ల క్రితం మేము ఆధునిక స్వీయ సంరక్షణ బ్రాండ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము. ప్రస్తుతం దీనిని మన దేశంలో ప్రారంభించాము.

త్వరలోనే ఇది మొత్తం ప్రపంచానికి చేరుకుంటుంది.. ఇది 82 ఈస్ట్ .. భారతదేశాన్ని ప్రపంచానికి అనుసంధానించే స్టాండర్డ్ మెరిడియన్ స్ఫూర్తితో మా బ్రాండ్ అంటూ 

అంటూ క్యాప్షన్ ఇస్తూ.. స్పెషల్ వీడియో షేర్ చేసింది. అందులో ఆమె నటనతోపాటు.. వ్యాపారరంగంలోకి అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చింది.