ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుక కోసం భారతీయులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రతి ఒక్కరి దృష్టి RRR సినిమాపై ఉంది.మార్చి 12న లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ వేడుక జరగనుంది.

అయితే 95వ ఆస్కార్ అవార్డులు ప్రెజెంట్ చేస్తున్న సెలబ్రిటీల పేర్లు బయటకు రాగా.. అందులో దీపికా పదుకొనే కూడా ఒకరుగా ఉన్నారు.

ఆస్కార్ 2023లో ప్రెజెంటర్‌ గా వ్యవహరించనున్న దీపికా పదుకొనే.. ఈ విషయాన్ని దీపిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

దీంతో ఆస్కార్ వేదికపై మిమ్మల్ని చూడాలని ఉంది మేడం అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.

ఇంకొందరు కంగ్రాట్స్ అని చెబుతుండగా.. దీపికకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.