గత సంవత్సరంలో  ‘‘ఎఫ్‌3’’, ఓరి దేవుడా సినిమాల్లో కనిపించి మెప్పించారు వెంకటేష్

ఈ అగ్ర  హీరో తర్వాత మూవీ గురించి గత కొన్ని రోజులుగా నెట్టింట వార్తలు వస్తున్న విషయం తెలిసిందే

తాజాగా వెంకటేష్‌ 75వ సినిమానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది

‘హిట్‌’ సిరీస్‌ చిత్రాలతో విజయాల్ని అందుకున్న శైలేష్‌ కొలను ఈ చిత్రానికి దర్శకుడు

‘శ్యామ్‌ సింగరాయ’ చిత్రంతో క్లాసిక్‌ హిట్‌ను సొంతం చేసుకొన్నా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ మూవీని నిర్మిస్తోంది

యాక్షన్‌ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వెంకటేష్‌ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్‌ మూవీ కానుంది

ఈ మేరకు దీనికి సంబంధించిన పోస్టర్‌ను షేర్‌ చేసిన వెంకటేష్‌ ‘‘సరికొత్త సాహసానికి సమయం వచ్చింది’’ అని పేర్కొన్నారు

జనవరి 25న ఈ చిత్ర పూజా కార్యక్రమం జరగనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు