నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘దసరా’
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు
ఇప్పటి వరకు చేయని ఊర మాస్ పాత్రలో నాని నటించడం, తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగడంతో ఈ చిత్రం భారీ అంచనాలు ఏర్పడ్డాయి
ఇప్పటికే విడులైన ఈ చిత్ర టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి
ఇప్పుడు ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసెందుకు సిద్ధం అవుతున్నారు మూవీ మేకర్స్
‘దసరా’ ట్రైలర్ ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం
ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్
ఈ పోస్టర్ లో రావణ దహనం జరుగుతుండగా చేతిలో రెండు గొడ్డళ్లతో నాని ఎదురుగా నిలుచున్న పవర్‌ఫుల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది