నాచురల్‌ స్టార్‌ నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం 'దసరా'.

 ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు చిత్రబృందం.

దసరా పోస్టర్‌లో సిల్క్ స్మిత ఫోటో ఉండడంపై ఆయన అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీకాంత్ ఓదెల సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. 'నా చిన్నప్పుడు మా తాతకు కాళ్లు విరిగిపోయాయి. తాతా కల్లు తీసుకురామంటే వెళ్లా.

 కల్లు దుకాణంలో ఫస్ట్‌ టైమ్ సిల్క్ స్మిత ఫోటో చూశా. అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు ఆమెను చూస్తూనే ఉన్నా.

 ఆ తర్వాత అనిపించింది నాకు. ఆమెలా చేయాలంటే చాలా గట్స్ ఉండాలేమో. ఆమెకు ఫ్యాషనేట్ సినిమాలంటే పిచ్చి అని విన్నాను.

చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్‌లో అలా ఉండిపోయింది. అందుకే కల్లు దుకాణం వద్దే సిల్క్ స్మిత ఫోటో పెట్టా.' అని అన్నారు.