రోజూ ఉదయాన్నే వేడి వేడిగా టీ గొంతులో పడకపోతే కొందరికి ఏమీ తోచదు.

అసలు రోజు ప్రారంభం అయినట్లు ఉండదు. కొందరు రోజూ బెడ్ టీతోనే తమ రోజువారి దినచర్యను మొదలు పెడతారు.

అయితే టీ తాగే సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఆహారాలను తీసుకోరాదు

ఉల్లిపాయలను పచ్చిగా తిని ఆ తరువాత టీ తాగరాదు.

నిమ్మరసం తాగిన తరువాత కూడా టీ తాగరాదు.

కొందరు శనగపిండితో తయారు చేసిన చిరుతిళ్లను తిన్నాక లేదా తింటూ టీ తాగుతారు. తిన్నాక టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు నష్టం జరుగుతుంది.

పసుపును లేదా దాంతో తయారు చేసే పదార్థాలను తిన్న వెంటనే కూడా టీ తాగరాదు.

టీ తాగక ముందే నీటిని తాగాలి. కానీ టీ తాగిన తరువాత నీళ్లను తాగరాదు.