పాడైన నిమ్మకాయలను ఇలా వాడొచ్చు
పాడైన నిమ్మకాయలను ముక్కలుగా కోసి, కొంచెం ఉప్పు కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి ఆ పేస్ట్ తో దీపారాధన సామాగ్రి తోమితే జిడ్డు పోతుంది.
కిచెన్ లోని సింక్, టైల్స్ పైన నిమ్మకాయ పేస్ట్ రాసి 20 నిమిషాల తర్వాత స్క్రబ్బర్ తో రుద్దితే సుభ్రమవుతాయి.
బకెట్లు, మగ్గులు, ట్యాపులను ఈ లెమన్ పేస్ట్ తో శుభ్రం చేయచ్చు.
నీళ్లు కాచే పాత్రల్లో ఏర్పడే తెల్లని చారాలను ఈ పేస్ట్ తో తొలగించవచ్చు.