అన్యోన్య దాంపత్యం కోసం ఈ కొన్ని నియమాల్ని అలవాట్లుగా మార్చుకుంటే  భార్యాభర్తల అనుబంధాన్ని నిత్యనూతనం ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు

ఆరోగ్యంతో అన్యోన్యత ఎవరైతే రోజూ అన్ని పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకుంటారో వారు మానసికంగా దృఢంగా ఉన్నట్లు ఓ బ్రిటిష్‌ అధ్యయనం రుజువు చేస్తోంది.

ఆరోగ్యంతో అన్యోన్యత దంపతులిద్దరూ ఇలా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ, సానుకూల దృక్పథంతో ఉంటే ఇక వారి మధ్య ప్రేమ తప్ప మరే ఆలోచన ఉండదని చెప్పకనే చెబుతోందీ అధ్యయనం

వాటిని నోట్‌ చేయాల్సిందేనట అయితే ఇలాంటి చిన్న చిన్న గొడవల్ని మాటలతోనే ఆపేయకుండా.. పేపర్‌పై పెట్టమంటోంది నార్త్‌వెస్ట్‌ యూనివర్సిటీ జరిపిన ఓ అధ్యయనం.

వాటిని నోట్‌ చేయాల్సిందేనట గొడవలకు అక్షర రూపమిస్తే ఇద్దరి మధ్య గొడవలకు అసలు కారణమేంటి? అందులో ఎవరి తప్పుంది? వంటి విషయాలన్నీ అవగతమవుతాయి. తద్వారా ఆ తప్పు మళ్లీ చేయకుండా జాగ్రత్తపడచ్చు. 

ఒక ముద్దు.. ఒక హగ్గు ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్‌, డోపమైన్‌, సెరటోనిన్‌.. అనే ఫీల్‌గుడ్‌ హార్మోన్లు విడుదలవుతాయి. 

ఒక ముద్దు.. ఒక హగ్గు ఇవి ఇద్దరిలో ఉన్న ఒత్తిడిని దూరం చేసి వారి మధ్య అనుబంధాన్ని మరింతగా పెంచుతాయి. కాబట్టి దంపతులిద్దరూ ఎంత బిజీగా ఉన్నా సరే.. రోజూ ముద్దులు, కౌగిలింతలకు కాస్త సమయం కేటాయించాలంటున్నారు నిపుణులు.

మీ ప్రశ్న.. వారి సమాధానం ఒకరికొకరు రోజుకో ఆసక్తికరమైన ప్రశ్నను సంధించుకోవాలంటున్నారు నిపుణులు.

మీ ప్రశ్న.. వారి సమాధానం  ఒకరి గురించి మరొకరు సమాధానం రాబట్టే క్రమంలో మధ్యమధ్యలో జోక్స్ వేసుకోవచ్చు.. సరదాగా నవ్వుకోవచ్చు.. ఇలా సరదాగా సాగే సంభాషణ ఇద్దరి మనసుల్ని మరింత దగ్గర చేస్తుందనడంలో సందేహమే లేదు.

వారానికో అరగంట వారానికోసారి ఓ అరగంట సమయం కేటాయించుకొని భార్యాభర్తలిద్దరూ వ్యక్తిగత ప్రణాళికలు, కుటుంబ ప్రణాళికల గురించి మాట్లాడుకోవాలి. 

వారానికో అరగంట ఇలా చేస్తే అన్ని విషయాల్లో ఇద్దరికీ ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడడంతో పాటు ఇద్దరి మధ్య అనుబంధమూ రెట్టింపవుతుంది.