కుర్ర హీరోలతో పోటీపడుతున్న సీనియర్ హీరోల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విక్టరీ వెంకటేష్ గురించి.
తనదైన కామెడీ టైమింగ్ తో నటన తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు వెంకీ.
సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ మూవీస్ కూడా చేస్తున్నారు వెంకీ.
ఇదిలా ఉంటే ఇప్పుడు వెంకటేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
వెంకటేష్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. వెంకటేష్ కొద్దిరోజుల పాటు సినిమాల కు దూరంగా ఉండనున్నారని టాక్ వినిపిస్తోంది.
వెంకటేష్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని కొన్ని రోజులు ఆధ్యాత్మిక సాధన చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
వెంకటేష్ కు దైవ భక్తి ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఆయన ఆ కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆధ్యాత్మిక సాధన చేయనున్నారని తెలుస్తుంది.