పిక్కలు పట్టేయడం, నొప్పి, వెరికోన్స్‌ వీన్స్‌ (సిరలు ఉబ్బిపోవడం) వంటి సమస్యలతో బాధపడుతున్న వారు..

సైక్లింగ్‌ చేస్తే ఉపశమనం పొందవచ్చు. వెరికోన్స్‌ వీన్స్‌ వల్ల కలిగే మంటలు, నొప్పలు, వాపులు సైక్లింగ్‌ వల్ల తగ్గుతాయి.

సైక్లింగ్‌ చేయడం వల్ల కాళ్లలో కండరాలు బలపడి రక్తం శరీర పైభాగాలకు చురుకుగా సరఫరా అవుతుంది.

కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధ పడే వారు కూడా సైక్లింగ్‌ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

మెనోపాజ్‌ దశలో ఉన్న స్త్రీలు సైకింగ్‌ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

మానసిక ఒత్తిడి తగ్గుతుంది.శరీరంలో ఎముకలు ధృడత్వం, హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది.

డయాబెటిస్‌తో బాధపడే వారు సైక్షింగ్‌ చేయడం వల్ల ఇన్ఫులిన్‌ని నిరోధించే శక్తి తగ్గి ఇన్సులిన్‌ స్వీకరించే శక్తి పెరుగుతుంది.

దీంతో డయాబెటిస్‌ నుంచి సులభంగా బయటపడవచ్చు. భవిష్యత్తులో డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.