మరో రెండు రోజుల్లో కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022 ప్రారంభంకానుండగా భారత్‌కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది

ఈ పోటీల్లో పతకాలు సాధించి భారత కీర్తిని నిలబెడతాడని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నీరజ్‌ చోప్రా నిరశ మిగిల్చాడు

కాలి గాయం కారణంగా ఈ ఏడాది కామన్వెల్త్‌ క్రీడల నుంచి నీరజ్‌ చోప్రా తప్పుకోవల్సి వచ్చింది

వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన నీరజ్‌ చోప్రాకు తుది పోరులో జావలిన్‌ విసిరే సమయంలో తొడ కండరాలు పట్టేశాయి

వైద్యులు పరీక్షించి కనీసం నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవల్సిందిగా సూచించారు

ఈ గాయంతో నీరజ్‌ క్రీడల్లో పాల్గొనలేడని వైద్యులు వెల్లడించారు

దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022 నుంచి నీరజ్‌ చోప్రా వెనుదిరగాల్సొచ్చింది