ఛత్రపతి శివాజీ టెర్మినస్ ను విక్టోరియా టెర్మినస్ అని కూడా పిలుస్తారు

సి.ఎస్.టీ, బాంబే వీ.టీ. అనే పేర్లు కూడా ఉన్నాయి

ఇది భారత రైల్వే జోన్ లలో మధ్య రైల్వేగా సేవలందిస్తోంది

భారతదేశంలోని రద్దీగల రైల్వేస్టేషన్లలో ఇదీ ఒకటి

కేంద్ర రైల్వే కేంద్రంగానే గాక 'ముంబై సబర్బన్ రైల్వే' కేంద్రంగానూ సేవలందిస్తోంది

1887-1888లో "ఫ్రెడరిక్ విలియం స్టీవెన్స్" దీని డిజైన్ రూపొందించారు

అప్పట్లోనే 16.14 లక్షల రూపాయల వ్యయంతో 10 సంవత్సరాల్లోనే నిర్మించారు

విక్టోరియా రాణి గౌరవార్థం "విక్టోరియా టెర్మినస్" అనే పేరు పెట్టారు

 జూలై 2, 2004 న ఈ స్టేషన్ కు యునెస్కో గుర్తింపు లభించింది