మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌ను విడిచిపెట్టిన క్రిస్టియానో రొనాల్డో

ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌ను విడిచిపెట్టాడు. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఈ విషయాన్ని ధృవీకరించింది.

పరస్పర ఒప్పందం ద్వారా క్రిస్టియానో ​​రొనాల్డో క్లబ్‌ను విడిచిపెడుతున్నట్లు మాంచెస్టర్ యునైటెడ్ తెలిపింది.

క్లబ్ మేనేజర్ ఎరిక్ టెన్ హాగ్‌కు వ్యతిరేకంగా ప్రజల నిరసన తర్వాత క్లబ్‌తో పోర్చుగీస్ ఆటగాడి భవిష్యత్తు ముగిసింది.

ఖతార్‌లో జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఘనాతో పోర్చుగల్ తొలి మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ఈ వార్త వచ్చింది.

సహకారం అందించినందుకు క్రిస్టియానో ​​రొనాల్డోకు క్లబ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

క్లబ్ తరఫున రొనాల్డో 346 మ్యాచ్‌ల్లో 145 గోల్స్ చేశాడు.

మాంచెస్టర్ యునైటెడ్‌లోని ప్రతి ఒక్కరూ మేనేజర్ ఎరిక్ టెన్ హాగ్ ఆధ్వర్యంలో ముందుకుసాగుతామంటూ ప్రకటిచింది.

బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్‌తో ఇటీవల ఇంటర్వ్యూ చేసినందుకు రొనాల్డో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు.

ఇంటర్వ్యూలో, రొనాల్డో అనేక విషయాలపై క్లబ్‌ను విమర్శించారు.

క్లబ్‌లోని కొందరు తనను 'బలవంతంగా తొలగించడానికి' ప్రయత్నిస్తున్నారని కూడా అతను ఆరోపించారు.

ఈ ఇంటర్వ్యూ ఫలితంగా రొనాల్డోతో విడిపోవాలని యునైటెడ్ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.