క్రిస్టియానో రొనాల్డో అనే పేరును ఒక్కసారి కూడా విననివారు ఉండరు. ఫుట్‌బాల్ చరిత్రంలో అతను ఓ లెజెండ్

పురుషుల ప్రపంచకప్ చరిత్రలో ఐదు వేర్వేరు టోర్నమెంట్లలో గోల్ చేసిన మొదటి ఆటగాడిగా రొనాల్డో నిలిచాడు.

నాలుగు వేర్వేరు ప్రపంచకప్ టోర్నమెంట్‌లలో గోల్ చేసిన ఆటగాడిగా పీలే, ఉవే సీలర్, మిరోస్లావ్ క్లోస్, లియోనెల్ మెస్సీతో పాటు రొనాల్డో ఉండేవాడు.

 కానీ ఇప్పుడు ఐదు వేర్వేరు ప్రపంచకప్ టోర్నమెంట్‌లలో గోల్స్ చేసిన రొనాల్డో రికార్డు పుస్తకాలలో నిలిచాడు.

పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటికి మొత్తం 8 గోల్స్ చేశాడు

2018 ప్రపంచ కప్‌లో ఏకంగా 4 గోల్స్ రొనాల్డో చేశాడు

గురువారం ఘానా‌తో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో.. క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ 3-2 తేడాతో విజయం సాధించింది.