రాత్రంతా ఆ హీరోయిన్‌తోనే.. ఆ తప్పుతో అడ్డంగా బుక్కయ్యా: బాంబ్ పేల్చిన యూవీ

TV9 Telugu

27 September 2024

క్రికెట్ ప్రపంచంలో సిక్సర్ కింగ్‌గా పేరుగాంచిన యువరాజ్ సింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలో నిలిచాడు. ఇటీవల, యువరాజ్ సింగ్ ఒక పోడ్‌కాస్ట్ సందర్భంగా ఓ సీక్రెట్ బయటపెట్టాడు.

పాడ్‌కాస్ట్‌లో ఈ క్రికెటర్ తన గర్ల్‌ఫ్రెండ్ పేరును వెల్లడించనప్పటికీ, ఒక విషయం గురించి బహిరంగంగా మాట్లాడాడు. యువరాజ్ సింగ్ ఆ సమయంలో జరిగిన ఒక ఫన్నీ సంఘటనను చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా టూర్‌లో నేను ఒక నటితో డేటింగ్ చేస్తున్నాను. ఆమె పేరు తీసుకోవడం నాకు ఇష్టం లేదని పాడ్‌కాస్ట్‌లో యువరాజ్ సింగ్ చెప్పాడు. ప్రస్తుతం ఆమె చాలా పేరున్న నటి అంటూ చెప్పుకొచ్చాడు. 

ఆ సమయంలో సదరు నటి అడిలైడ్‌లో షూటింగ్‌లో ఉందని, నేను ఆస్ట్రేలియా పర్యటనపై దృష్టి పెట్టాల్సి ఉన్నందున కొంతకాలం నన్ను కలవవద్దని చెప్పాను. 

మేం కొంతకాలం దూరంగా ఉందామని, కెరీర్‌పై దృష్టి పెట్టాలని అనుకున్నాం. అయితే, ఆ నటి నన్ను అనుసరించి బస్సు ఎక్కి కాన్‌బెర్రాకు వచ్చింది. నేను మీతో సమయం గడపాలనుకుంటున్నాను అని చెప్పిందని తెలిపాడు.

ఆ తర్వాత మేమిద్దరం ఒక హోటల్‌లో బస చేశాం. నేను ఆమెకు చాలా వివరించాను. ఉదయం ప్రాక్టీస్‌కి వెళ్లాల్సి వచ్చినప్పుడు నటి నా బ్యాగ్‌ని ప్యాక్ చేసిందని యువరాజ్ చెప్పాడు. 

నా చెప్పులు దొరకలేదు. దీంతో ఆమె పింక్ షూస్ వేసుకుని బయటకు వచ్చాను. బస్సులో అందరూ నన్ను ఎగతాళి చేశారు. విమానాశ్రయంలో బూట్లు దాచేందుకు ట్రై చేశాను అంటూ చెప్పాడు.

ఆ నటి దీపికా పదుకొణేనా అని అభిమానులు ఊహాగానాలు ప్రారంభించారు. ఎందుకంటే ఒకప్పుడు దీపిక, యువరాజ్‌ల ఎఫైర్ గురించి చాలా చర్చలు జరిగాయి.