ముంబైలో మరో ఇల్లు కొన్న యశస్వి జైస్వాల్.. ధరెంతో తెలుసా?
21 February 2024
TV9 Telugu
టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ఫాం ప్రస్తుతం పీక్‌లో ఉంది. మైదానంలో అతని బ్యాట్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది.
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించడం ద్వారా యశస్వి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో టీమిండియా విజయానికి తానే స్టార్ అని నిరూపించుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తన పేరును చాటి చెబుతున్నాడు ఈ ముంబై కుర్రాడు.
కఠోర శ్రమతో ఈ స్థానానికి చేరుకున్న యశస్వి.. క్షేత్రంలోనూ, బయటా తన కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటూ తన కలలను నిజం చేసుకుంటున్నాడు.
గత ఏడాది యశస్వి ముంబైలో తన సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నాడు. తన కుటుంబంతో కలిసి 5 బెడ్‌రూమ్ అపార్ట్మెంట్‌కు మారాడు. ఇప్పుడు నగరంలో తన పేరు మీద మరో ఇల్లు కొన్నాడు.
అవును, మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, 22 ఏళ్ల యశస్వి ముంబైలోని బాంద్రా-ఈస్ట్ ప్రాంతంలో 10-BKC ప్రాజెక్ట్‌లో రూ. 5.38 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడంట.
నివేదిక ప్రకారం, 1110 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ జనవరి 7, 2024న యశస్వి పేరు మీద రిజిస్టర్ చేయబడింది. ఈ ప్రాజెక్ట్ బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో భాగం.
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో యశస్వి ప్రదర్శన విషయానికొస్తే, అతను 3 టెస్టుల తర్వాత 545 పరుగులతో ఆధిక్యంలో దూసుకెళ్తున్నాడు.