కోహ్లికే సాధ్యంకాలే.. స్పెషల్ రికార్డుతో 2వ భారత ప్లేయర్‌గా జైస్వాల్..
ధర్మశాలలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు కూడా చేయలేని ఫీట్‌ని టెస్టుల్లో యశస్వి సాధించాడు.
వాస్తవానికి, ఒక టెస్టు సిరీస్‌లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. ఇంతకు ముందు భారత వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో యశస్వి ఇప్పటివరకు 712 పరుగులు చేశాడు. దీంతో ఈ భారత యువ ఆటగాడు టీమిండియా దిగ్గజం గవాస్కర్ లిస్టులో చేరాడు.
భారత్ తరపున ఒక టెస్టు సిరీస్‌లో అత్యధికంగా, 700+ పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా సునీల్ గవాస్కర్ నిలిచాడు. తన కెరీర్‌లో 2సార్లు ఈ ఘనతను సాధించాడు.
గవాస్కర్ 1971లో వెస్టిండీస్‌పై 774 పరుగులు, అలాగే 1978/79 సంవత్సరంలో విండీస్‌పై 732 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ కూడా ఇప్పుడు సునీల్ గవాస్కర్ క్లబ్‌లో చేరాడు.
టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. 2014/15లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 692 పరుగులు, 2016లో స్వదేశంలో ఇంగ్లండ్‌పై 655 పరుగులు చేశాడు.
5వ టెస్ట్‌లో యశస్వి ప్రదర్శన గురించి మాట్లాడితే, అతను 58 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
ఈ సిరీస్‌లో యశస్వి జైస్వాల్ రెండు హాఫ్ సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది.