06 Sep 2023
Pic credit - Instagram
ODI ప్రపంచ కప్ 2023 కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 15 మంది సభ్యుల జట్టులో కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడంపై ప్రశ్నలు తలెత్తాయి.
అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈసారి కూడా ప్రపంచకప్‌నకు టీమిండియా ఎంపిక చేయని ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. దీంతో రిటైర్మెంట్ చేయండి బ్రదర్ అంటూ ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు.
చాహల్ స్థానంలో అతని సన్నిహితుడు కుల్దీప్ చాహల్‌ను జట్టులోని ఏకైక మణికట్టు స్పిన్నర్‌గా చేర్చారు. దీంతో చాహల్‌కు స్థానం దక్కలేదు.
వరుసగా మూడు ప్రపంచకప్‌లకు చాహల్‌కు చోటు దక్కలేదు. 2021 T20 ప్రపంచ కప్‌లో కూడా ఎంపిక కాలేదు. అయితే 2022 ప్రపంచ కప్‌లో జట్టులో ఉన్నప్పటికీ చాహల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.
ఇలాంటి పరిస్థితుల్లో చాహల్ ఇప్పుడు భారత్ బయటకు వెళ్లి ఆడాలని నిర్ణయించుకున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, కౌంటీ క్రికెట్ ఆడేందుకు చాహల్ ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు. బీసీసీఐ నుంచి అనుమతి కూడా పొందాడు.
ప్రసిద్ధ క్లబ్ కెంట్ కౌంటీ కోసం చాహల్ 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు నివేదికలో పేర్కొంది. అదే సమయంలో టీమ్ ఇండియాకు అవసరమైతే ఈ ఒప్పందాన్ని మధ్యలోనే వదిలివేసి తిరిగి వస్తారు.
కొద్ది నెలల క్రితమే, టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా కెంట్ జట్టులో భాగమయ్యాడు. చాలా సంవత్సరాల క్రితం రాహుల్ ద్రవిడ్ కూడా కెంట్ కోసం కౌంటీ క్రికెట్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.