బుమ్రా బౌలింగ్‌పై ఆరోపణలు.. ఐసీసీ యాక్షన్ తీసుకోవాలంటూ ట్వీట్స్.. 

4th Nov 2023

Pic credit - Instagram

ప్రపంచకప్-2023లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్, శ్రీలంకలకు చెందిన కొందరు ఆందోళనకు గురయ్యారు. మహ్మద్ షమీ, సిరాజ్ బౌలింగ్‌పై ప్రశ్నలు సంధించారు. 

భయపడుతోన్న బ్యాటర్లు..

కాగా, శ్రీలంకకు చెందిన ఓ క్రికెట్ అభిమాని జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్‌పై ప్రశ్నలు లేవనెత్తాడు. బుమ్రా చర్య అనుమానాస్పదంగా ఉందని, ఐసీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు.

శ్రీలంక అభిమాని డిమాండ్

డేనియల్ అలెగ్జాండర్ అనే వినియోగదారు Xలో జస్ప్రీత్ బుమ్రా అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్‌పై ICC ఎప్పుడు దర్యాప్తు చేస్తుంది? ఐసీసీని ట్యాగ్ చేస్తూ రాసుకొచ్చాడు

xలో ఏమన్నారంటే

ఈ ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా ప్రమాదకరమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు 15 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

ప్రమాదకరంగా బుమ్రా

నవంబర్ 2న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి షాక్ ఇచ్చింది బుమ్రానే. ఇన్నింగ్స్ తొలి బంతికే బుమ్రా వికెట్ తీశాడు.

తొలి బంతికే వికెట్‌

జస్ప్రీత్ బుమ్రా (39)గాయం తర్వాత బుమ్రా ప్రపంచకప్‌లో పునరాగమనం చేశాడు. ప్రస్తుతం బౌలింగ్‌ చేస్తున్న తీరు చూస్తుంటే గతంలో కంటే మరింత డేంజర్‌గా మారాడు. 

గాయం తర్వాత పునరాగమనం

శ్రీలంక అభిమానికి ముందు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా సిరాజ్, షమీల బౌలింగ్‌పై ప్రశ్నలు సంధించాడు. వేరే బంతిని షమీ-సిరాజ్‌కి ఇచ్చారని, దీనిపై ఐసీసీ విచారణ జరిపించాలన్నాడు. 

రజా ప్రశ్నలు

అయితే రజా ప్రశ్నపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఓ ప్రకటన ఇచ్చాడు. ఇదో జోక్ అన్నారు. రజా తనను తాను అవమానించుకోవాలి. పాకిస్తాన్‌ను కాదంటూ తేల్చాడు.

ఖండించిన అక్రమ్