ఖాతా తెరవడానికి 19 బంతులు.. కట్‌చేస్తే.. చివరి బంతికి 13 పరుగులు.. 

09th OCT 2023

Pic credit - Instagram

ప్రపంచకప్‌లో భాగంగా హైదరాబాద్‌లో నెదర్లాండ్స్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆరో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

ప్రపంచ కప్‌లో ఆరో మ్యాచ్..

తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. విల్ యంగ్ 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రచిన్ రవీంద్ర, టాప్ లాథమ్ హాఫ్ సెంచరీలు ఆడారు.

అదరగొట్టిన కివీస్

న్యూజిలాండ్ తన ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ముగించింది. 50వ ఓవర్ చివరి బంతికి 13 పరుగులు చేసింది. ఈ ఫీట్‌ని మిచెల్ సాట్నర్ సాధించాడు. 

చివరి బంతికి 13 పరుగులు

నెదర్లాండ్స్ బౌలర్ బాస్ డి లీడే చివరి ఓవర్ బౌల్ చేశాడు. అతను చివరి బంతిని నో బాల్‌గా వేశాడు. దానిపై సాట్నర్ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత చివరి బంతికి ఫ్రీ హిట్‌పై సిక్స్ కొట్టి మొత్తం 13 పరుగులు చేశాడు. 

ఇలా 13 పరుగులు

సాట్నర్ దూకుడుగా బ్యాటింగ్ చేసి 17 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అతని ఇన్నింగ్స్ కారణంగా కివీస్ జట్టు 322 పరుగులు చేయగలిగింది. 

సాట్నర్ తుఫాను ఇన్నింగ్స్

అంతకుముందు న్యూజిలాండ్ జట్టు ఖాతా తెరవడానికి 19 బంతులు పట్టింది. ఇన్నింగ్స్‌లో మొదటి మూడు ఓవర్లు మెయిడిన్లు. నాలుగో ఓవర్ తొలి బంతికే కివీ జట్టు ఖాతా తెరిచింది. విల్ యంగ్ ఫోర్ కొట్టి జట్టు ఖాతా తెరిచాడు. 

తొలి మూడు ఓవర్లు మెయిడెన్‌

కివీ జట్టుఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్లు రెండో మ్యాచ్ ఆడుతున్నాయి. కివీ జట్టు తన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలుపొందగా, పాకిస్థాన్‌పై నెదర్లాండ్స్ ఓడిపోయింది.

ఫామ్‌లో కివీస్ జట్టు

ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మైదానం భారీ స్కోర్‌లకు ప్రసిద్ధి చెందింది. కివీ బ్యాట్స్‌మెన్ దానిని పూర్తిగా ఉపయోగించుకున్నారు. 

దంచికొట్టిన కివీస్‌ బ్యాట్స్‌మెన్స్