05th OCT 2023
Pic credit - Instagram
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ప్రపంచ కప్ 2023 ఎట్టకేలకు ప్రారంభం కానుంది. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ అక్టోబర్ 5 గురువారం జరుగనుంది. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గత ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచి, విశ్వవిజేతగా నిలిచింది.
కాగా, ఆ మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ జట్టు భావిస్తోంది. ఛాంపియన్ హోదాతో బరిలోకి దిగుతోన్న ఇంగ్లండ్, విజయంతో టోర్నీని ఆరంభించాలని చూస్తోంది.
అయితే, ఈ తొలి మ్యాచ్‌కు గాయాల బెడద వీడలేదు. దీంతో ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ముగ్గురు పెద్ద ఆటగాళ్లు ఆడడంలేదు. ఇది ఇరుజట్లకు పెద్ద దెబ్బగా మారింది.
గత ప్రపంచకప్ ఫైనల్‌లో స్టార్‌గా నిలిచిన ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌లో ఆడటం కష్టంగా మారింది. స్టోక్స్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడలేకపోయాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు బట్లర్‌కు తుంటి గాయం ఉందని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో స్టోక్స్ ఆడటంపై ఇంగ్లండ్ జట్టు మ్యాచ్ రోజునే నిర్ణయం తీసుకోనుంది.
అదే సమయంలో, న్యూజిలాండ్ కూడా సమస్యలను ఎదుర్కొంటుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆడడం లేదు. ఈ విషయాన్ని ముందే ప్రకటించారు.
ఇప్పుడు ఆ జట్టు వెటరన్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ కూడా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. సౌదీకి ఇటీవల బొటనవేలు శస్త్రచికిత్స జరిగింది, దాని నుండి అతను ఇంకా కోలుకోలేకపోయాడు.